16-10-2025 08:35:06 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ వచ్చిన సమాచారం మేరకు FRO టాస్క్ ఫోర్స్ బృందం, సిరిచెల్మ ఫారెస్ట్ సిబ్బంది కలిసి గుండాల గ్రామ సమీపంలోనీ అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. సుమారు రూ. 90 వేల విలువైన 9 టేకు దుంగలు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్.ఆర్.ఓ గంటల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పట్టుకున్న కలపను ఇచ్చోడ డిపో కి తరలించామన్నారు.
గుండాలా గ్రామస్తులు అక్రమంగా అడవిలో నరికి వాటిని చెక్కల సైజులుగా కోయడానికి గుట్టపై సిద్ధం చేసుకోగా అధికారులు దాడులు చేయగా, దుండగులు పారిపోయరాని , వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సోదాలో DRO అమర్ సింగ్, కవిత బీటు అధికారులు సజన్ లాల్, భీంజి నాయక్, రాకేష్, స్వాతి, డ్రైవర్ సాయికుమార్ బేస్ క్యాంప్ సభ్యులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.