calender_icon.png 16 October, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే బాలు నాయక్

16-10-2025 08:57:34 PM

ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే..

దేవరకొండ: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. గురువారం నేరేడుగోమ్ము మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతున్నామని, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికమైన ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలోని కొండ మల్లేపల్లి మండలంలో 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేశారని త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.