16-10-2025 06:22:39 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలైన గంజాయి, హెరాయిన్ వంటి మత్తు పదార్ధాలు తీసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని బూర్గంపాడు ఎస్ఐ మేడా ప్రసాద్ సూచించారు. బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తుపదార్థాల వినియోగం -వాటి వల్ల కలిగే అనర్ధాలపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు గురువారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తుపదార్థాలు, పొగాకు ఉత్పత్తులు వినియోగించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు కోల్పోతారన్నారు. బూర్గంపాడు మండలంలో ఎక్కడైనా గంజాయి,ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ఐ నాగబిక్షం,కళాశాల ప్రిన్సిపాల్ చిన్యా, సీనియర్ అధ్యాపకులు సిహెచ్ నాగేశ్వరావు, ఎన్ఎస్ఎస్ పివో జి. శ్రీనివాస్ అధ్యాపక బృందం, కానిస్టేబుల్ లు పిచ్చయ్య, రాము, అధ్యాపకేతరసిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.