calender_icon.png 16 October, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన క్యాబినెట్ సమావేశం.. కీలక నిర్ణయం

16-10-2025 09:16:53 PM

హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) మీడియాతో మాట్లాడుతూ... రైతును రాజును చేయాలనే తపన మా ప్రభుత్వానికి ఉందని.. ఈ వర్షాకాలం వరి పంట దిగుబడి అద్భుతంగా రాబోతుందని అన్నారు. 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాబోతోందని.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో దిగుబడి రాలేదని తెలిపారు.

ఈ సీజన్లో 80 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సిన పరిస్థితి ఎదురైందని అన్నారు. అలాగే స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే నూతనంగా మూడు వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కళాశాలలు హుజూర్నగర్, కొడంగల్, నిజామాబాద్ లో ఏర్పాటు చేయనున్నారు.