13 July, 2026 | 7:29 AM

మరో నాలుగు పతకాలు ఖాయం

03-05-2024 01:17 AM

అస్థానా (కజకిస్థాన్): ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్లు అదరగొట్టారు. గురువారం నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్లో అడుగుపెట్టి పతకాలు ఖాయం చేసుకున్నారు. గురువారం జరిగిన 51 కేజీల క్వార్టర్ ఫైనల్లో జాదుమణి సింగ్  5 భూటాన్‌కు చెందిన కిన్లీపై విజయం సాధించాడు. 57 కేజీల విభాగంలో నిఖిల్ 4 అయూబ్ ఖాన్ (ఉజ్బెకిస్థాన్)ను చిత్తుచేశాడు. ఇక అజయ్ (63.5 కేజీలు), అంకుశ్ (71 కేజీలు) ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి రిఫరీ స్టాప్స్ కంటెస్ట్ (ఆర్‌ఎస్సీ) నిర్ణయంతో సెమీస్ బెర్తులు దక్కించుకున్నారు. అంతకముందు మహిళల విభాగంలో ఆర్యన్ (92 కేజీలు), నిషా (52 కేజీలు), అకాంక్ష పలాస్వల్ (70 కేజీలు), రుద్రికా (75 కేజీలు) కార్టర్స్‌లో నెగ్గి సెమీస్‌లో అడుగుపెట్టారు.