భారత షట్లర్లకు నిరాశ
చెంగ్డూ (చైనా): ప్రతిష్ఠాత్మక థామస్, ఉబెర్ కప్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పురుషుల జట్టు క్వార్టర్స్‌కే పరిమితమై తీవ్రంగా నిరాశపరిచింది. అటు మహిళల బృందం కూడా క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత పురుషుల జట్టు 1 తేడాతో చైనా చేతిలో పరాజయం పాలైంది. లక్ష్యసేన్ ఒక్కడే విజయం సాధించగా.. హెచ్ ఎస్ ప్రణయ్, సాత్విక్ ధ్రువ్ సాయి జోడీలు తమ మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వడంతో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది.
తొలి సింగిల్స్‌లో హెచ్ ఎస్ ప్రణయ్ 21 11 14 ప్రపంచ రెండో ర్యాంకర్ షి యూ కి చేతిలో ఓడాడు. అనంతరండబుల్స్‌లో సాత్విక్ జోడి 15 21 12 లియాంగ్ వీ కెంగ్ చాంగ్ జంట చేతిలో ఓటమి చవిచూసింది. ఈ దశలో రెండో సింగిల్స్‌లో లక్ష్యసేన్ 13 21 21 లీ షి ఫెంగ్‌పై అధ్బుత విజయాన్ని నమోదు చేసి చైనా ఆధిక్యాన్ని 2 తగ్గించాడు. రెండో డబుల్స్ పోరులో ధ్రువ్ జంట 10 10 రెన్ గ్జియాంగ్ జి టింగ్ చేతిలో ఓటమి చవిచూడడంతో భారత్ పరాజయం ఖరారైంది. మరో సింగిల్స్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాల్సి వచ్చింది.
అమ్మాయిలు కూడా..
అంతకముందు భారత మహిళా షట్లర్ల బృందం కూడా క్వార్టర్స్‌కే పరిమితమైంది. టాప్ షట్లర్ పీవీ సింధు గైర్హాజరీలో అనుభవం లేని యువ జట్టు గురువారం జపాన్ చేతిలో 3 ఓటమిపాలైంది. క్వార్టర్స్‌లో పటిష్టమైన జపాన్‌తో తలపడిన మన అమ్మాయిలు తమ శక్తికి మించి పోరాడినప్పటికి ఫలితం లేకుండా పోయింది. తొలి సింగిల్స్‌లో అస్మిత చలిహా 10 22 15 ప్రపంచ 11వ ర్యాంకర్ అయా ఒహోరి చేతిలో పరాజయం చవిచూసింది. ఇక డబుల్స్‌లో ప్రియా జోడితో పాటు రెండో సింగిల్స్‌లో ఇస్రానీ బరుహా ఓటమి పాలవడంతో.. భారత్‌కు టోర్నీ నుంచి నిష్క్రమించింది.






