13 July, 2026 | 8:23 AM

సారథిగా సలీమా

03-05-2024 01:14 AM

భారత మహిళల హాకీ జట్టు

న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా మిడ్ ఫీల్డర్ సలీమా టెటేను ఎంపిక చేస్తూ హాకీ ఇండియా (హెచ్‌ఐ) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వెటరన్ గోల్‌కీపర్ సవిత పూనియా స్థానంలో సలీమాను ఎంపిక చేసినట్లు తెలిపింది. బెల్జియం, ఇంగ్లండ్ వేదికలుగా జరగనున్న ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ కోసం హాకీ ఇండియా 24 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ రెండు టోర్నీలకు మిడ్‌ఫీల్డర్ నవనీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.