calender_icon.png 4 May, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్ర బాటపట్టిన ఆశావహులు

27-11-2024 04:45:01 AM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం ప్రయత్నాలు

కరీంనగర్, నవంబర్ 26 (విజయక్రాంతి):కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే ఆశావహుల ప్రచారం రాష్ట్ర సరిహద్దు దాటింది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లా సరిహద్దులకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని ప్రాంతాలతోపాటు ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో ఉపాధి కోసం వెళ్లిన పట్టభద్రులను కలిసేందుకు మహారాష్ట్ర బాటపట్టారు. నాందేడ్, చంద్రాపూర్, గడ్చిరోలి, ముంబై, భీవండి ప్రాంతా ల్లో వరుసగా పర్యటిస్తున్నారు.

అక్కడ స్థిరపడ్డ పట్టభద్రులు దాదాపుగా 5 నుంచి 10 వేల మంది ఉన్నారు. వారు ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఓటర్లుగా ఎన్‌రోల్ చేసుకోవ డంతో వీరిని ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పయనమయ్యారు. ఓటుకు ఓటు ఆసరా అన్నట్లుగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. అల్ఫోర్స్ విద్యాసం స్థల అధినేత నరేందర్‌రెడ్డి మంగళవారం చంద్రాపూర్‌లో పర్యటించారు.