calender_icon.png 30 July, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూడైస్ నంబర్ కేటాయించండి

19-07-2025 12:00:00 AM

ఒక పాఠశాలను ప్రభుత్వం గుర్తించి యూడైస్ గుర్తింపు నంబర్ కేటాయిస్తేనే పథకాలు విద్యార్థుల దరి చేరతాయి. వారికి పక్కా పాఠశాల భవనం, మధ్యాహ్న భోజన సదుపాయం తదితర వసతులు సమకూరుతాయి. కానీ, ఉట్నూరు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐటీడీఏ) పరిధిలోని 15 పాఠశాలలకు గుర్తింపు దక్కకపోవడంతో విద్యార్థులు ప్రభుత్వ ఫలాలకు దూరంగా ఉంటున్నారు.

యూడైస్ గుర్తింపు నంబర్ లేకపోవడంతో టీడబ్ల్యూపీఎస్ పాఠశాలలో విద్యార్థుల పేర్లను నమోదు చేసి విద్యను బోధిస్తున్నారు. ఆదిలాలాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గట్టిపల్లి పంచాయతీ పరిధి చింతగూడలో 12 మంది విద్యార్థులకు పాఠాలు బోధించేదుకు సీఆర్డీటీని నియమించారు.

ప్రతిరోజు పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని గట్టెపల్లి పాఠశాల నుంచి తీసుకొచ్చి వడ్డించాల్సి వస్తోంది. కేవలం, ఈ పాఠశాలకు మాత్రమే కాకుండా ఇంద్రవెల్లి, సిరికొండ, ఉట్నూర్, తదితర మండలాల పరిధిలోని 15 పాఠశాలకు యూడైస్ గుర్తింపు లేదు.  

 రమేశ్, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ జిల్లా