26-07-2025 07:37:12 PM
మణుగూరు,(విజయక్రాంతి): ఓసీ-4 కట్ట తెగి పంట నష్టపోయిన గిరిజన రైతు తాటి భానుచందర్ కు సింగరేణి సంస్థ పంట నష్ట పరిహారం అందజేసింది. శనివారం జీఏం కార్యాలయంలో జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ రైతుకు రూ.3,42,720/- పంట నష్ట పరిహారం చెక్ ను అందించారు. 2022-23 సంవత్సరంలో ఓసీ-4 కట్ట తెగడంతో పంట నష్టం జరిగింది. ఈ కార్యక్రమంలో డిజిఎం (పర్సనల్) రమేష్, సీనియర్ ఎస్టేట్స్ అధికారి బాబుల్ రాజ్ పాల్గొన్నారు.