26-07-2025 07:37:19 PM
కేసుల పరిష్కారానికి చర్యలు..
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా న్యాయ మండలిలో జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు గౌరవ న్యాయమూర్తి శ్రీమతి శ్రీవాణి అధ్యక్షతన జిల్లా పోలీసు అధికారి డా.జి.జానకి షర్మిల ఐపీఎస్(Janaki Sharmila IPS) సమక్షంలో కేసుల పురోగతిపై సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి, పోలీసు అధికారులకు, కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేస్తూ, పెండింగ్‌లో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, చార్జ్‌షీట్లు దాఖలు వంటి అంశాలపై విపులంగా చర్చ జరిగింది. కేసుల విచారణలను వేగవంతం చేయాలని, సకాలంలో చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని, న్యాయ ప్రక్రియలు ఆలస్యంకాకుండా చూడాలని, సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా న్యాయమూర్తి శ్రీ వాణి, జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ తో పాటు జిల్లా సబ్ జడ్జి శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధిక, ఆర్ డి ఓ రత్న కల్యాణి, భైంసా ఏ ఎస్పీ అవినాష్ కుమార్ ఐపిఎస్, నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీన ఐపిఎస్,ఇన్స్పెక్టర్లు పఎస్ఐ లు, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్స్,ఇతర కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.