calender_icon.png 27 July, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షన్ దారులను ద్రోహం చేస్తే రేవంత్ ప్రభుత్వానికి పాపం తాకుతుంది

26-07-2025 07:18:42 PM

ఆగస్టు 1న మిర్యాలగూడలో పెన్షన్ దారుల జిల్లా మహాసభ..

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): పెన్షన్ దారులను ద్రోహం చేస్తే రేవంత్ ప్రభుత్వానికి పాపం తాకుతుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ(MRPS State President Govindu Naresh Madiga) అన్నారు. నల్గొండ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్, విహెచ్ పిఎస్ అనుబంధ సంఘాల సమీక్షా సమావేశం శనివారం జిల్లా కేంద్రంలోని డా.అంబేద్కర్ స్ఫూర్తి భవన్ లో మాసారం వెంకన్న మాదిగ అధ్యక్షతన జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే వికలాంగుల రూ 4000 ఉన్న పెన్షన్ రూ.6000 చేస్తామని, అలాగే వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు ఇతర చేయూత పెన్షన్ దారుల పెన్షన్ రూ 2016 నుండి 4000 పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారం పీఠం మీద కూర్చోగానే ఇచ్చిన హామీలను మరచిపోయి మోసం చేసిందని అన్నారు. 

చేయూత పెన్షన్ పరిధిలో ఉన్న అన్ని రకాల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 1వ తేదీన మిర్యాల గూడ పట్టణంలో వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారుల నల్లగొండ జిల్లా సన్నాహక సభను నిర్వహిస్తున్నామని , దీనికి ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ రాబోతున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుండి పెన్షన్ దారులు తరలిరావాలని పిలుపునిచ్చారు.