calender_icon.png 27 July, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా పంపిణీ కేంద్రాలను సందర్శించిన పోలీస్ కమిషనర్

26-07-2025 07:20:21 PM

ఖమ్మం (విజయక్రాంతి): యూరియా పంపిణీ కేంద్రాలైన తల్లాడ సొసైటీ, గంగిదేవిపాడు సొసైటీని పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Police Commissioner Sunil Dutt) శనివారం సందర్శించారు. రైతులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లాలో అవసరమైన యూరియా అందుబాటులో ఉండేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారని, ఆందోళన చెందవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. యూరియా, ఎరువుల యొక్క వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.