calender_icon.png 27 July, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్న డీఐజీ

26-07-2025 07:23:07 PM

అలంపూర్: గద్వాల జిల్లాలోని దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను తెలంగాణ రాష్ట్ర డిఐజి లాల్ శంకర్ చౌహన్(State DIG Lal Shankar Chauhan), జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు(SP Srinivasa Rao)తో కలిసి శనివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. వీరి వెంట సిఐ రవిబాబు, వెంకటస్వామి ఉన్నారు.