calender_icon.png 27 July, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య ద్వారా మాత్రమే పేదరికం నిర్మూలన సాధ్యం

26-07-2025 07:26:53 PM

జిల్లా కలెక్టర్ పని తీరును ప్రశంసించిన బీసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

ఎమ్మెల్యే తో ప్రారంభించిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): విద్య ద్వారా మాత్రమే పేదరికంను నిర్మూలించవచ్చని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలం రహింఖాన్ పేట గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్ లో ఆన్ అకాడమీ ద్వారా ఆన్ లైన్ తరగతులను స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. మాడల్ స్కూల్ లో విద్యార్థులకు కలెక్టర్,ఎమ్మెల్యే మ్యాథ్స్, తెలుగు, అకౌంటింగ్ ఇంగ్లీష్ పాఠాలను బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి వారి నుండి సమాధానాలు రాబట్టారు.

కిచెన్ షెడ్డు ను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం రుచిగా వండి వడ్డించాలని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఏ జిల్లాలో లేనివిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ చోరువతో ప్రత్యేకంగా ఆన్ అకాడమీ ద్వారా ఆన్ లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న బీసి రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను ఫోన్ ద్వారా అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ మాట్లాడుతూ, విద్య ద్వారా మాత్రమే పేదరికం తగ్గిపోతుందని బలంగా విశ్వసిస్తూ పేదలు అధికంగా ఉండే ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పిల్లలకు పోటీ పరీక్షల రాసేందుకు ఆన్ లైన్ తరగతుల ద్వారా మంచి శిక్షణ ఉచితంగా  అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఆన్ లైన్ తరగతుల్లో దేశంలోని నిపుణులైన టీచర్లచే పిల్లలకు బోధన జరుగుతుందని, ఢీల్లీ లో విద్యార్థులకు అందే శిక్షణ నేడు సాంకేతికతను వినియోగించుకుని మన సిరిసిల్ల జిల్లాలోని పిల్లలకు కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థి జీవితంలో 10,11,12వ తరగతులు మూడు సంవత్సరాలు చాలా కీలక సమయమని, దీనిని సద్వినియోగం చేసుకుంటే జీవితం బాగుంటుందన్నారు. ముఖ్యమైన పాఠ్యాంశాలలో బేసిక్స్ ఇంటర్ లో ప్రారంభం అవుతాయని అన్నారు. కాలిక్యులస్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎలక్ట్రో మ్యాగ్నెటిసమ్ వంటి ముఖ్యమైన పాఠ్యాంశాలను కాన్సెప్ట్ పక్కాగా నేర్చుకోవాలన్నారు.

తదుపరి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ పేదల విద్యకై నిరంతరం కృషి చేస్తూ పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిల్లలకు ఆన్ లైన్ తరగతుల ద్వారా ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కలెక్టర్ ప్రత్యేక చోరువ చూపారన్నారు. మోడల్ స్కూల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు.శనివారం, ఆదివారం, సెలవు రోజుల్లో కూడా విద్యార్థులు కొంత సమయం చదువు కోసం వెచ్చించాలని అన్నారు. గ్రాడ్యుయేషన్ మంచి కళాశాలలో చేసేందుకు  ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం బాగా చదువుకుంటేనే  జీవితం బాగా ఉంటుందన్నారు. ఇతర అవసరాలకు, మరమ్మతులకు, సమస్యలు పరిష్కారానికి  నిధులను మంజూరు చేస్తామని తెలిపారు.