26-07-2025 07:32:46 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులకు రూ .1.12 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల శనివారం బిచ్కుంద మార్కెట్ యార్డ్ ఆవరణలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పాలకవర్గ సభ్యులు పాలాభిషేకం చేశారు. మార్కెట్ కమిటీకి అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం పట్ల చైర్మన్ కవితా ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... బిచ్కుంద మార్కెట్ ఏర్పడినప్పటి నుంచి నిధులు సమకూరలేదని. గత ప్రభుత్వా నాయకుల అసమర్ధత కారణంగా మార్కెట్ కమిటీ నిధుల కొరత ఉండేదని ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషి వల్ల నిధులు మంజూరు కావడం ఎమ్మెల్యే పనితనానికి నిదర్శనమని అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తో ట లక్ష్మీకాంతారావు కు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు మార్కెట్ పాలకవర్గం, కాంగ్రెస్ నాయకులు తరపున ధన్యవాదాలు తెలిపారు.