26-07-2025 07:32:53 PM
గద్వాల టౌన్: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రోగులకు అరుదైన చికిత్స చేశారు. గత 20 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధ పడుతున్న మహిళకు ముడుచుకుపోయిన పేగులను హెర్నియ ఆపరేషన్(Hernia operation)లో భాగంగా 4 గంటల పాటు శ్రమించి పేగులను విడదీసి ఆపరేషన్ నిర్వహించి అనంతరం మహిళ ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పురిటి నొప్పులతో ఉన్న మహిళకు ఉమ్మనీరు ఎక్కువగా ఉందని ఆ మహిళకు ఆపరేషన్ చేసి బిడ్డకు జన్మనిచ్చిందని ఆ మహిళ క్రిటికల్ పొజిషన్లో ఆసుపత్రికి రాగ ఆమెకు కూడ చికిత్స చేసి ఇబ్బంది పడిన మహిళను ఆపరేషన్ చేసి సక్సెస్ చేసినట్టు వైద్యులు తెలిపారు. ఈ సర్జరీలో డాక్టర్ విపంచి, డాక్టర్ కేచరి, డాక్టర్ విజయ భాస్కర్, డాక్టర్ స్పందన పాల్గొన్నారు.