05-09-2025 08:16:02 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని శిల్పా కళా వేదిక లో శుక్రవారం జరిగిన వేడుక సమావేశంలో ఉత్తమ ఉపాద్యాయ అవార్డు ను కామారెడ్డి డైరీ కళాశాల డెన్ సురేష్ రాథోడ్ అందుకున్నారు. కళాశాల డెన్ సురేష్ రాథోడ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నరని కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.డెయిరీ కళాశాల కామారెడ్డి నుండి ఉత్తమ ఉపాద్యాయ అవార్డు అందుకోవడం వరుసగా నాలుగవ అసోసియేట్ డీన్ గా సురేష్ రాథోడ్ రికార్డు నెలకొల్పారు. సురేష్ రాథోడ్ ని యూనివర్సిటీ విశ్వ విద్యాలయ కులపతి డా.ఙ్ఞానపకాష్ , యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. శరత్ చంద్ర, అభినందించారు.