16 August, 2026 | 1:46 AM

లోక్‌భవన్‌లో ‘ఎట్ హోం’

16-08-2026 12:45 AM
  1. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తేనేటి విందు
  2. సీఎం రేవంత్‌రెడ్డి, హైకోర్టు సీజే ఏ.కే సింగ్, డీజేపీ సీ.వీ ఆనంద్, ఇతర ప్రముఖుల హాజరు

హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి) : 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం లోక్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు సీఎం రేవంత్‌రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ హాజరై ప్రముఖులతో ముచ్చటించారు.

వీరితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సంజయ్ జాజు, డీజీపీ సీ.వీ ఆనంద్, పలువురు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

లోక్ భవన్‌లో ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ‘ఎట్ హోం’ కార్యక్రమం..  ప్రజాప్రతినిధులు, న్యాయ, పరిపా లనా రంగాల ప్రముఖుల కలయికకు వేదికగా నిలిచింది. అయితే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎవరూ హాజరుకాకపోవడం గమనార్హం.