15 April, 2026 | 11:22 PM

విజ్ఞాన్స్‌లో ముగిసిన అటల్ ఎఫ్‌డీపీ

19-10-2025 12:05 AM

ఆరు రోజుల పాటు కార్యక్రమ నిర్వహణ

పాల్గొన్న పద్మశ్రీ అవార్డీ, ఫ్రొఫెసర్ ఈడీ జెమ్మిస్, వివిధ రాష్ట్రాల అధ్యాపకులు, రీసర్చ్ స్కాలర్లు

హైదరాబాద్, అక్టోబర్ 18(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఆరు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి అటల్ ఆన్‌లైన్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌డీపీ) శనివారం విజయవంతంగా ముగిసింది. ఏఐ-డ్రివెన్ బయోరీమెడి యేషన్ ఆఫ్ వేస్ట్ వాటర్ విత్ సస్టైనబుల్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనే అంశంపై ఏఐసీటీఈఏటీఏఎల్ అకాడమీ సహకారంతో విజ్ఞాన్ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ మరియు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఈ నెల 13 నుంచి 18 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ విద్యా సం స్థలకి చెందిన 135కి పైగా అధ్యాపకులు, రీసర్చ్ స్కాలర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రొఫెసర్ ఈడీ జెమ్మిస్ (ఐఐఎస్‌సీ బెంగళూరు), ఫ్రొపెసర్ భారతం ప్రసాద్ (ఎన్‌ఐపీఈఆర్ మోహాలి), ప్రొఫెసర్ కేఎస్‌ఎంఎస్ రాఘవరావు (ఐఐటీ తిరుపతి), ఫ్రొపెసర్ కమలం జోసెఫ్ (సీడబ్ల్యూర్‌డీఎం) పాల్గొని ప్రసంగించారు. 

ఆరు రోజులపాటు జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో ఏఐ ఆధారిత వ్యర్థ జలశుద్ధి విధా నాలు, సుస్థిర హైడ్రోజన్ ఉత్పత్తి, బయో-రియాక్టర్ డిజైన్ మరియు నీటి సమస్యల పరిష్కారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి.

హైడ్రోజన్ ప్రొడక్ష్ప ప్రత్యేక ఉపన్యాసం

ముగింపు సెషన్‌లో పాల్గొన్న డాక్టర్ సయ్యద్ ఖాదిర్ మోయినుద్దిన్ (కేఎఫ్‌యూ, సౌదీ అరేబియా) హైడ్రోజన్ ఫ్యూయల్ ప్రొడక్షన్ మరియు స్టోరేజ్ పై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం ఆన్లైన్ టెస్ట్, ఫీడ్‌బ్యాక్ మరియు వాలెడిక్టరీ సెషన్‌తో కార్యక్రమం ముగిసింది.