‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి
- 2028 ఎన్నికలకు ఈ అక్టోబర్‌లోనే ఓటర్ల జాబితా ఫైనల్
- గాంధీభవన్‌లో వార్‌రూమ్:సీఎం రేవంత్‌రెడ్డి
- బెంగాల్‌లో ఏమి జరిగిందో గమనించాలి
- ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓట్లలో మెజారిటీ శాతం ఓట్లను పక్కన పెట్టాలని చూస్తున్నారని, అదే జరిగితే రాజకీయంగా అత్యంత ప్రమాదకరమన్నారు. 2028 ఎన్నికలకు 2026 అక్టోబరులోనే ఓటర్ల జాబితా ఫైనల్ అవుతుందని, ఓట్లు తొలిగిపోతే ఆ తర్వాత చేసేదేమీ ఉండదన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన సోమవారం జరిగిన జూమ్ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఇంన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 119 నియోజకవర్గాలలో ప్రతీ గ్రామంలో, ప్రతీ బూత్‌లో బీఎల్‌వోలతో ముఖ్య నాయకులను అనుసంధానం చేసుకోవాలని, ఈనెల 20లోగా జిల్లాల ఇంచార్జి మంత్రులు సంబంధిత పార్లమెంటు, అసెంబ్లీ ఇంచార్జ్‌లతో సమీక్ష నిర్వహించాలన్నారు. గాంధీ భవన్‌లో వార్‌రూమ్ ఏర్పాటు చేసి బూత్‌లెవెల్ మానీటరింగ్ చేయాలన్నా రు. బంగాల్‌లో ఏం జరిగిందో గమనించాలని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ సూచించారు.






