15 April, 2026 | 9:31 PM

కాలుష్య రహితంగా పండుగను జరుపుకోవాలి

19-10-2025 12:03 AM
  1. పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి
  2. పాఠశాల డైరక్టర్ కొండా శ్రీధర్‌రావు
  3. ‘రెజొనెన్స్’లో ఘనంగా దీపావళి వేడుకలు 

హైదరాబాద్, అక్టోబర్ 18(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని శ్రీనగర్‌లో ఉన్న రెజొనెన్స్ స్కూల్‌లో శనివారం దీపావళి వేడుకలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు రకరకాల ఆకృతిలతో దీపాలను వెలిగించి కండ్లు మిరుమిట్లు గొలిపే విధంగా రంగు రంగుల కాంతివంతమైన కాకరవత్తులను వెలిగించి ఒక రోజు ముందుగానే దీపావళి పండుగకి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ దీపావళి పండుగను కాలుష్యరహితంగా, పర్యావరణ హితంగా జరుపుకోవాలని సూచించారు. తారాజువ్వలాగా ఆకాశమే హద్దుగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటూ మీ భవిష్యత్తు అంతా దీపావళి వెలుగుల మాదిరి ప్రకాశవంతం కావడానికి రెజొనెన్స్ స్కూల్ శ్రీనగర్ ప్రణాళిక బద్దంగా పనిచేస్తుందన్నారు. దీపావళి ప్రత్యేకతను తెలియచేస్తూ చెడుపై మంచి విజయానికి చిహ్నంగా దీపావళిపండుగను జరుపుకుంటారని అన్నారు.

అందరి జీవితాలలో అంధకారం తొలిగి వెలుగులు నిండా లని సుఖసంతోషాలతో ఉండాలని విద్యార్థులను ఆశీర్వదించి అందరికి దీపావళి శుభా కాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరక్టర్ కొండా కృష్ణవేణి పాల్గొని పర్యావరణ హితమైన దీపాల వెలుగులతో దీపావళి జరుపుకోవాలని విద్యార్థులు టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పీవీఆర్.మురళీమోహన్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.