calender_icon.png 5 July, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్సీపీఎస్పీ కన్వీనర్‌గా అథేర్ నవాబ్

05-07-2025 01:45:18 AM

న్యాయబద్ధంగా బాధ్యతలను నిర్వహిస్తా: మహ్మద్ అథేర్ నవాబ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): ఎన్సీపీ-ఎస్పీ (శరద్ చంద్ర పవార్) పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా డాక్టర్ మహ్మద్ అథేర్ నవాబ్‌ను నియమించినట్లు పార్టీ అధిష్ఠానం శుక్రవారం ప్రకటిం చింది. గతంలో ఆయన ఎన్సీపీ యువజన విభాగం తెలంగాణ రాష్ట్రా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అదే సమయం లో డాక్టర్ అథేర్ నవాబ్ యువత సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు.

ఇప్పుడు రాష్ట్ర కన్వీనర్‌గా ఆయనను నియమించడం పట్ల పార్టీలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ అథేర్ నవాబ్ మాట్లాడుతూ.. పార్టీ నాయకత్వం తనకు ఇచ్చిన బాధ్యతను న్యాయంగా నిర్వహిస్తూ, పార్టీ శ్రేణులను మరింతగా చేర్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్సీపీ-ఎస్పీ అభివృద్ధికి కృషి చేస్తాను అని తెలిపారు.