calender_icon.png 5 July, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమంతరావు చతుర్విధ జల ప్రక్రియతో కరువు నివారణ

05-07-2025 01:43:50 AM

  1. మహారాష్ట్రలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టండి

ఆ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణను కోరిన మర్రి శశిధర్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): మహారాష్ట్రలో నీటి భద్రతకు హనుమంతరావు కాన్సెప్ట్ ఉత్తమ ఎంపిక అవుతుందని బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎం మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి మర్రి శశిధర్ రెడ్డి గురువారం ముంబై రాజ్ భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణను కలిసి వివరించారు. ఇతర వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్ర మాలు నీటి లభ్యతను పెంచలేకపోయినప్పుడు హనుమంతరావు కాన్సెప్ట్ అద్భుత మైన ఫలితాలను అందించగలిగిందని వివరించారు.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గొట్టిగారిపల్లి గ్రామంలో, రాజస్థాన్‌లో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేశామని మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. సీహెచ్ విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు, వివిధ సంస్థలు, విభాగాలకు గవర్నర్ ఆదేశాలను జారీ చేసే నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. మహారాష్ట్రలో ఈ హనుమంత్ వాటర్‌షెడ్ అభివృద్ధి భావనను అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని అభ్యర్థించారు.

గవర్నర్ ట్రస్ట్ ఇన్‌పుట్‌లతో వ్యవసా య విశ్వవిద్యాలయాలలో ఒకదానితో కలిసి ఒక తాలూకాలో పైలట్ ప్రాజెక్ గా చేపడతామని గవర్నర్ హామీ ఇచ్చారు. ఈ అంశంపై వివరణాత్మక నోట్‌ను కూడా ఆయన సమర్పించారు. ఈ సందర్భంగా 2016లో దివంగత హనుమంతరావు చేసిన చెన్నారెడ్డి స్మారక ఉపన్యాసం కాపీని కూడా గవర్నర్‌కు మర్రి శశిధర్‌రెడ్డి సమర్పించారు. సమావేశంలో గవర్నర్ కార్యదర్శి డాక్టర్ ప్రశాంత్ నార్నవారే ఐఏఎస్ పాల్గొన్నారు.

హనుమంతరావు రూపొందించిన చతుర్విధ జల ప్రక్రియను ప్రచారం చేయడానికి ట్రస్ట్ చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ అభినందించారు. ఇది దేశంలోని రైతులకు గొప్ప వరమవుతుందని పేర్కొన్నారు. చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్, హనుమంతరావు రూపొందించిన తక్కువ ఖర్చుతో కూడిన వాటర్‌షెడ్ అభివృద్ధి కోసం ఫోర్ వాటర్స్ కాన్సెప్ట్‌ను ముమ్మరంగా ప్రచారం చేస్తుంది.

2001లో తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో ఎకరానికి రూ. 5000 ఖర్చుతో ఈ కాన్సెప్ట్‌ను అమలు చేశారు. ఇది ఏడాదిలో మూ డు పంటలకు నీటిని అందించగలిగింది. నేటి ధరల ప్రకారం ఈ విధానానికి ఎకరానికి దాదాపు రూ.15 వేలు ఖర్చవుతుంది.