4 April, 2026 | 3:27 AM

ఆత్రం సక్కు గెలుపు ఖరారు

15-05-2024 01:29 AM

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 14 (విజయక్రాంతి): ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రం సక్కు గెలుపు ఖాయమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధీమా వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని, అధికారంలో లేకున్నా బీఆర్‌ఎస్ సైనికులు నిరంతరం ఆత్రం సక్కు గెలుపు కోసం కృషి చేశారని అభినందించారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారిని పార్టీ ఎప్పుడు గుండెల్లో పెట్టుకోని చూసుకుంటుందని అన్నారు. సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్‌హైమద్, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్, సలాం, పట్టణ అధ్యక్షుడు హైమద్ పాల్గొన్నారు.