09-07-2025 12:46:30 AM
- కోట్ల విలువైన ఆర్టీసీ భూములు
- ఉండాల్సింది 6.07 ఎకరాలు
- ఉన్నది 4 ఎకరాలు
- చోద్యం చూస్తున్న ఆర్టీసీ అధికారులు
- సహ చట్టంతో వాస్తవాలు వెల్లడి
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 8 (విజయ క్రాంతి); పిల్లి గుడ్డిదైతే... ఎలుక ఎక్కిరించింది అన్న చందాన ఉంది ఆర్టీసీ అధికారుల తీరు. ప్రభుత్వం ఎలా చేసిన కోట్ల విలువైన భూ మి అక్రమార్కులు చేతుల్లో బందీ అవుతున్న తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రూ కోట్ల విలువగల ఆర్టీసీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇటీవల సమాచా ర హక్కు చట్టం ద్వారా ఇల్లందు ఆర్టీసీ భూ ముల వివరాలను కోరగా 1974లో ప్రభు త్వం సర్వేనెం బర్ 537లో 6.07 ఎకరాల స్థలాన్ని ఆర్టీసీకి కేటాయించారు.
తూర్పున అలుగు వర్రే, పడమర 60 అడుగుల సీసీ రోడ్డు, రైల్వే ఫార్మేషన్, దక్షిణమున 20 అడుగుల బండ్ల దారి, ఉత్తరమున ప్రవేట్ భూములు ఈ హ ద్దుల్లో ఆర్టీసీ స్థలాన్ని కేటాయించారు.ఆ స్థలంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో బస్టాం డ్ నిర్మా ణం, మిగిలిన 3.07 ఎకరాల్లో పార్కింగ్ కోసం కాలీ స్థలాన్ని ఉంచారు. ఆనాడు రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే నిర్వహించలేదని తెలిపారు. కాలక్రమేనా ఆర్టీసీ స్థలాలు బడా బాబుల చేతుల్లో బందీ అయ్యాయి. ప్రస్తు తం కేవలం 4. ఎకరాలు మాత్రమే ఉండటం గమనార్హం.
2004 సంవత్సరంలో సుమారు 0.24 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు రెవెన్యూ అధికారులు కేటాయించ డం జరిగింది. మొదట్లో కేటాయించిన 6.07 ఎకరాల నుంచి 0.24 ఎకరాలు మినహా యించిన నికరంగా 5.22 ఎకరాల భూమి ఆర్టీసీకి ఉందని సమాచార లో తెలియజే. వాస్తవంగా ప్రస్తుతం కేవలం 4 ఎకరాలు మాత్రమే ఆర్టీసీ స్వాధీనంలో ఉంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు సర్వే నిర్వహించి ఆ క్రమించిన ఆర్టీసీ స్థలాన్ని స్వాధీనం చేసుకొ ని ప్రభుత్వ ఆదాయాన్ని పరిరక్షించాలని ఇ ల్లెందు పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం దక్షిణం వైపు నిర్మిస్తున్న 20అడుగుల రోడ్డును ఏకంగా 30 అడుగులుగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్డు విస్తీర్ణంలో మధ్యభాగం నుంచి ఇరువైపులా విస్తీర్ణం చేయాల్సి ఉంది. ఇల్లందు ఆర్టి సి బస్టాండ్ పక్కన నిర్మిస్తున్న రోడ్డు విస్తీర్ణం పనులు ఒక వైపే ఆర్టీసీ స్థలాన్ని ఆక్రమించి రోడ్డు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి.