calender_icon.png 30 January, 2026 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువుల కాపరిపై ఎలుగుబంటి దాడి

26-10-2024 11:08:11 AM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆరుబయట నిద్రిస్తున్న ఓ పశువుల కాపరిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటన  జిల్లాలోని పదర మండలం ఉడిమిళ్ళ గ్రామ శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారు ప్రాంతంలో ఆరు బయట నిద్రిస్తున్న పశువుల కాపరి అంజయ్య(65) రోజులాగే ఆరుబయట నిద్రించగా తెల్లవారుజామున అడవి ప్రాంతంలోని ఎలుగుబంటి వృద్ధుడిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన పశువుల కాపరిని అచ్చంపేట సర్కార్ దవాఖానాకు తరలించారు. అతన్ని నల్లగొండ జిల్లా కాసరాజ్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.