calender_icon.png 30 January, 2026 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి

30-01-2026 10:21:40 AM

  1. నామినేషన్ సెంటర్ వద్ద 144 సెక్షన్
  2. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
  3. మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి
  4. హుజూర్ నగర్ సిఐ చరమందరాజు

హుజూర్ నగర్: ఎన్నికల నియమా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, నామినేషన్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని హుజూర్ నగర్ సిఐ చరమందరాజు తెలిపారు. మున్సిపల్ సాధారణ ఎన్నికలలో నామినేషన్ వేసే అభ్యర్థులకు శుక్రవారం చివరి రోజు కావడంతో హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో నామినేషన్ కేంద్రాల వద్ద అన్ని పార్టీల అభ్యర్థుల సందడి కొనసాగుతుంది.ఈ సందర్భంగా సిఐ చరమందరాజు సూర్యాపేట జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున గుంపులు గుంపులుగా గుమికూడి ఉండకూడదన్నారు.పలు పార్టీల అభ్యర్థులకు సూచనలు చేశారు.అభ్యర్థులు లోపలికి వచ్చేటప్పుడు సెల్ ఫోన్లు నామినేషన్ సెంటర్ లోనికి అనుమతి లేదన్నారు.

ఏదైనా ఊరేగింపు ర్యాలీలకు డీజే సౌండ్ సిస్టంలకు అనుమతి లేదన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో గల హుజూర్ నగర్ మున్సిపాలిటీ, నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ సెంటర్ వద్దకు నామినేషన్ వేసే అభ్యర్థులు మాత్రమే సెంటర్ కి రావాలి అతనితోపాటుగా మరో ఇద్దరికి మాత్రమే లోపలికి అనుమతి ఉందన్నారు. అభ్యర్థులు ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించరాదని,బైకులతో లేదా కారులతో ఏదైనా ర్యాలీ నిర్వహించాలనుకుంటే రిటర్నింగ్ అధికారి వద్ద తగిన అనుమతి  పొంది ర్యాలీ తీసుకోవాలి అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.అభ్యర్థులు ఒకరిపై మరొకరు సోషల్ మీడియా ద్వారా అసత్య ఆరోపణలను ప్రోత్సహించిన వారిపై చర్చ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.