30-01-2026 09:55:26 AM
జిల్లావ్యాప్తంగా రెండవ రోజు 269నామీనేషన్లు దాఖలు
వనపర్తి:(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల పోరుకు రెండవ రోజు నామినేషన్ల జోరు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 5 మున్సిపాలిటీలలో 80 వార్డులకు సంబంధించి నామీనేషన్ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు 269 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు అధికారకంగా ప్రకటించారు.అందులో వనపర్తి మున్సిపాలిటీ లో కాంగ్రెస్ 49 , బీఆర్ఎస్ 36, బిజెపి 22 , సిపిఎం 3, ఇండిపెండెంట్ 22 , అమరచింత మున్సిపాలిటీలో కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 6 , బిజెపి, 9, ఇండిపెండెంట్ 6 , ఆత్మకూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 7, బిజెపి 7, సిపిఎం 4 , ఇండిపెండెంట్ 3, కొత్తకోట మున్సిపాలిటీలో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, బిజెపి 3, బి ఎస్పీ 2 , ఇండిపెండెంట్ 4, పెబ్బేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ 11 , బీఆర్ఎస్ 7, బిజెపి 9 , బి ఎస్పీ 1, ఇండిపెండెంట్ 2 నామినేషన్ దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.