calender_icon.png 30 January, 2026 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఒక ల‌క్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి

30-01-2026 10:13:30 AM

వోక్సెన్ యూనివ‌ర్సిటీలో ఒలింపియాడ్ ముగింపు క్రీడ పోటీల్లో మాజీ జేడీ ల‌క్ష్మినారాయణ‌

మునిప‌ల్లి జనవరి 29 (విజయక్రాంతి):  విద్యార్థులు చ‌దువుతోపాటు క్రీడాల్లో రాణించేందుకు ఒక ల‌క్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాల‌ని సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ వివి ల‌క్ష్మీనారాయ‌ణ అన్నారు.  మండ‌లంలోని కంకోల్ వోక్సెన్  విశ్వ‌విద్యాల‌యం లో గ‌త రెండు రోజులు గా నిర్వ‌హించిన ఒలింపియాడ్ క్రీడ‌ల్లో భాగంగా గురువారం ముగిసింది. ఈ ముగింపు కార్య‌క్ర‌మానికి  ముఖ్య అతిథిగా సీబీఐ మాజీ జాయింట్  డైరెక్ట‌ర్   ల‌క్ష్మీనారాయ‌ణ  హాజ‌రై విద్యార్థుల‌కు ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు  చేసి మాట్లాడారు.  ఒలింపియాడ్  పోటీల్లో  విద్యార్థులు సమూహాలలో పనిచేయడం, వారి జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవడం నేర్చుకునేటప్పుడు ఉపాధి అవ‌కాశాలు క‌లుగుతాయ‌న్నారు. 

అలాగే  ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు  ఒక ల‌క్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాల‌న్నారు.    విద్యార్థులు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి తమను తాము సిద్ధం చేసుకున్న‌ప్పుడే స‌మాజంలో మంచి గుర్తింపు వ‌స్తుంద‌ని విద్యార్థుల‌కు సూచించారు.   అనంత‌రం క్రీడ‌ల్లో గెలుపొందిన క్రీడాకారుల‌కు  బ‌హుమ‌తులు అంద‌జేసి  అభినందించారు.  అంత‌కు ముందు  వోక్సెన్ విశ్వవిద్యాల‌యం ఆధ్వ‌ర్యంలో ర‌చించిన   కెరీర్  క‌నెక్ట్  2.0 అనే హ్యాండ్ బుక్ ను  వోక్సెన్ యూనివ‌ర్సిటీ  సీఈఓ విశాల్ ఖుర్మ,  హైదరాబాద్ డీఏఓ  సహ వ్యవస్థాపకుడు శివ్ రామ్ శాస్త్రి జొన్నలగడ్డ,  జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్,   సెక్యూరిటీ హెడ్ డాక్టర్ శ్రీరంగ నరసింహ గాంధీ ఆర్యవల్లితో క‌లిసి  వారు ప్రారంభించారు.  ఈ కార్య‌క్ర‌మంలో    బెర్నార్డ్ భూటియా; లైఫ్ స్కిల్స్ ట్రైనర్ భవానీ సింగ్; లైఫ్ స్కిల్స్ ట్రైనర్ సయ్యద్ హసన్ అబ్దుల్లా; మరియు ఆప్టిట్యూడ్ ట్రైనర్ అవినాష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.