30-01-2026 10:11:53 AM
మహబూబ్ నగర్ (విజయ క్రాంతి): జిల్లాలోని ఒక కార్పొరేషన్ రెండు మున్సిపాలిటీల నుంచి రెండవ రోజు గురువారం 241 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్ నుంచి 195, దేవరకద్ర మున్సిపాలిటీ లో 29, భూత్పూర్ మున్సిపాలిటీలో 17 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్లు అత్యధికంగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు సైతం మరింత పకడ్బందీగా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు.