30-01-2026 10:02:08 AM
కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి చేరికలు.
రాజన్నసిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల వేల సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నుండి ఆరవ వార్డు నాయకులు దూడం రజని శ్రీనివాస్ సిరిసిల్ల తెలంగాణ భవన్ లో కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) సమక్షంలో పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి దూడం రజని శ్రీనివాస్ తో పాటు అనుచరులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్ .1వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నేత బూర బాలు పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి తుల ఉమ, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,కెడిసిసిబి మాజీ చైర్మన్ కొండూరు రవీందర్ రావు,జిందం చక్రపాణి,రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగ రావు,జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.