05-09-2025 01:01:31 PM
పాయిజన్ తీసుకొని ప్రేమ జంట ఆత్మహత్య..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం(Bhadrachalam) పట్టణంలోని కరకట్ట(స్మశాన వాటిక) అనుకొని ఉన్న ఒక లాడ్జిలో శుక్రవారం ఉదయం 8.00 గంటల ప్రాంతంలో ప్రేమజంట పాయిజన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో సంచలనంగా మారింది. యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... యువతిని వైద్య నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించిగా కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు సమాచారం... కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకుడికి ఇదివరకే పెళ్లి అయినట్లు తెలిసింది.