07-09-2025 07:40:23 PM
పటాన్ చెరు (విజయక్రాంతి): గణపతి లడ్డూ వేలం అదరహో అన్నట్లుగా సాగింది. గల్లీ నుంచి మొదలుకుంటే బడా గణేశుడి వరకు లడ్డూ దక్కించుకునేందుకు పోటాపోటీగా పాల్గొన్నారు. పటాన్ చెరు ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ నవరాత్రుల కంటే చివరి రోజున జరిగే లడ్డూ వేలం నిర్వహణకు ప్రత్యేక ఆకర్షణ ఉండగా… ఏటా గణేశుడి లడ్డూలు రికార్డు ధరలు పలుకుతున్నాయి. జరిగిన లడ్డూ వేలంలో రూ.42000 పలికింది. గతేడాది కంటే రెండింతలు రేటుతో లంబోధరుడి లడ్డూను పటాన్ చెరు మండలం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి(Youth Congress President Narender Reddy) దక్కించుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ లడ్డు దక్కించుకోవడం నాకు చాలా సంతోషమని తెలిపారు.