05-09-2025 01:04:17 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ 16వ గణేష్ నవరాత్రి ఉత్సవాల 9 కిలోల తాపేశ్వరం లడ్డుకు వేలంపాట నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి వరకు హోరాహోరీగా జరిగిన లడ్డు వేలంపాటలో మాజీ సర్పంచ్ బట్టు శ్రీను 2,36,116 రూపాయలకు వేలంలో పాట పాడి గణనాథుడి లడ్డును దక్కించుకున్నారు. వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ప్రతినిధులు లడ్డు దక్కించుకున్న బట్టు శ్రీనును సన్మానించి, భాజా భజంత్రీల మధ్య లడ్డును అందజేశారు.