08-11-2025 04:20:10 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక కట్ చేశారు. ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కవిత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గల అభ్యున్నతి ఎనలేని కృషి చేస్తున్నారని విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధిని మరియు సంక్షేమాన్ని రెండు కళ్ళల కాపాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో కారు చీకట్లను ప్రారద్రోలి రాష్ట్రాన్ని కారు మబ్బుల నుంచి కాపాడారని పేర్కొన్నారు.