08-11-2025 04:17:40 PM
చిట్యాల,(విజయక్రాంతి): చదువుకున్న పాఠశాల మీద మమకారంతో పాఠశాల ప్రధాన గేటు, ఆర్చ్ నిర్మించి శనివారం పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన గేటు, ఆర్చ్ ని 1985-86 పదవ తరగతి కి చెందిన పూర్వ విద్యార్థులు నిర్మించారు. చదువుకున్న పాఠశాలలకు తమ వంతు సహాయ సహకారాలు చేయడం అనేది చాలా గొప్ప విషయమని గేట్ ప్రారంభించిన అనంతరం గ్రామానికి చెందిన ప్రముఖులు, ఉపాధ్యాయులు విద్యార్థులు వారందరికీ శాలువల తో సన్మానించి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలపారు.
ప్రారంభించిన పూర్వ విద్యార్థులు ఎన్నారై కోయగుర శ్రీనివాస్ గౌడ్, ఎలక్ట్రికల్ ఏఈ ఎద్దుల ప్రభాకర్ రెడ్డి, డి.ఎస్.పి సప్పిడి మోహన్ రెడ్డి, పొట్లపల్లి వెంకన్న, సప్పిడి సినారెడ్డి,ఏర్పుల యాదయ్య, వరికుప్పల మల్లేష్,గంగపురం భాస్కర్ ,పొట్ట శ్రీనివాస్, కోటా రాంబాబు, గుర్రం వెంకటేష్ ,ప్రధానోపాధ్యాయులు పి .శ్రీధర్ ఉపాధ్యాయులు లుకేందర్ రెడ్డి.