13-10-2025 12:00:00 AM
సూర్యాపేట, అక్టోబర్ 12 (విజయక్రాంతి) : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బిఆర్ గవాయ్ పైనే ఓ మతోన్మాది న్యాయవాది బూటు విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని సిపిఐ రాష్ర్ట కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ధర్మ బిక్షం భవనంలో ముఖ్య నాయకుల సమావేశం లో పాల్గొని మాట్లాడారు.
సనాతన ధర్మం పేరిట ప్రధాన న్యాయమూర్తి పై బూటు విసిరివేసే ప్రయత్నం న్యాయవ్యవస్థ తమకు అనుకూలంగా వ్యవహరించాలని బెదిరిస్తూ చేసే అరాచకత్వానికి నిదర్శనమన్నారు. రాజ్యాంగాన్ని నిలబెట్టటానికి సామాజిక అడ్డంకులను బద్దలు కొట్టిన వ్యక్తిని బెదిరించటానికి, అవమానించటానికి జరిగిన ప్రయత్నమే ఈ దాడి యత్నం అన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని మన న్యాయ వ్యవస్థకు సురక్షితం భద్రత ప్రధానమైనదన్నారు. కుల, మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నీ సామాజిక న్యాయం కోరే దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాట శక్తులన్నీ ఐక్యంగా నిలబడి పోరాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు మండల వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.