13-10-2025 11:37:08 PM
ఎమ్మెల్యే బొజ్జు పటేల్..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): స్వంత ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఆశ్రయం ఇవ్వడం మాత్రమే కాదని, అది భవిష్యత్తుకు భరోసా అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. పీవీటీజీల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఉట్నూర్ మండలం కామైపేట్ గ్రామానికి చెందిన 140 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేసి, ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ...ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పిల్లల కలలకు పునాదనీ అన్నారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పీవీటీజీ కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడే దిశగా ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.