13-10-2025 11:13:25 PM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రజా ఆరోగ్యం పశువులకు గాలికుంటు వ్యాధి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిం-చేందుకు కృషి చేయాలని కోరారు. అంతకుముందు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్ పైజాన్ అహ్మద్ డిఆర్‌ఓ రత్న కళ్యాణి అధికారులు పాల్గొన్నారు.