calender_icon.png 14 October, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఐసీ బలోపేతానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి

13-10-2025 12:00:00 AM

ఐసీఈయూ సౌత్ సెంట్రల్ జోన్ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ పిలుపు

మహబూబాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సంస్కరణల మూలంగా ఎల్‌ఐసీ రోజురోజుకు క్షీణిస్తోందని, తిరిగి బలోపేతం చేయడం కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ సౌత్ సెంట్రల్ జోన్ ప్రధాన కార్యదర్శి టీ.వీ.ఎన్.ఎస్ రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు.

ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ వరంగల్ డివిజన్, 39వ వార్షిక మహాసభ మహబూబాబాద్ పట్టణంలో ఆదివారం జరిగింది. ఈ సభకు ఐసిఈయు వరంగల్ డివిజన్ ప్రెసిడెంట్ బి. శ్రీహరి అధ్యక్షత వహించారు. అంతకుముందు స్థానిక ఎల్‌ఐసి కార్యాలయం నుండి ఫంక్షన్ హాల్ వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.

వరంగల్ డివిజన్, ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్ 39వ వార్షిక మహాసభ జరుగుతున్న నేపథ్యాన్ని వివరిస్తూ స్వాగతోపన్యాసం చేశారు. మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన రవీంద్రనాథ్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అమలు చేస్తోందని విమర్శించారు. ప్లాటినం జూబ్లీ జరుపుకుంటున్న  ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించి, ఉద్యోగుల హక్కులు సాధించిందని, ఇవేవీ యాజమాన్యం ఉద్యోగుల మీద ప్రేమతో దయతో ఇచ్చినవి కాదని పోరాటాల ద్వారానే సాధించామన్నారు. 

జోనల్ సంయుక్త కార్యదర్శి తిరుపతయ్య మాట్లాడుతూ అద్భుతమైన వేతన సవరణ పొందగలిగామంటే అందుకు కారణం ఎల్‌ఐసి బలంగా ఉండడమే కారణమని, సంస్థ అలా బలంగా ఉండాలంటే దాని వెనుక వెన్నుదన్నుగా నిలిచే యూనియన్ కూడా బలంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీని బలోపేతం చేయడం ద్వారానే ప్రజలకు ఉపయోగం ఉంటుందని, దానికోసం అందరూ కృషి చేయాలని చెప్పారు.

ఎల్‌ఐసి ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉందని వంద శాతం క్లెయిమ్స్ ఎల్‌ఐసి ద్వారా అందుతున్నాయని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని తెలిపారు. ఎల్‌ఐసి ఉద్యోగులు ఏజెంట్ల సమిష్టి కృషి ద్వారానే ప్రజలకు సేవలందిస్తున్నారని వెల్లడించారు. 

సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు, యూనియన్ డివిజన్ కార్యదర్శి ఎం. ప్రభాకర్, వరంగల్ డివిజన్ కోశాధికారి రేష్మ, సంయుక్త కార్యదర్శి ఏ.చంద్రశేఖర్, మహిళా విభాగ కన్వీనర్ కే.అమ్మాజీ, ఎల్‌ఐసి ఏవో ఐ నాయకులు కమటం స్వామి, బానోత్ సేవియా, మీగడ లింగన్న, ఎల్‌ఐసి ఎల్ ఐ ఏ ఎఫ్ ఐ నాయకులు బెల్లంకొండ శ్రీనివాస్, బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం, మోహన్ రెడ్డి  పాల్గొన్నారు.