calender_icon.png 14 October, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం

13-10-2025 11:28:17 PM

కలెక్టరేట్ ముందు నల్ల జెండాలతో ఎంఆర్పీఎస్ నాయకుల నిరసన

మంచిర్యాల (విజయక్రాంతి): సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి బీఆర్ గవాయిపై దాడిని నిరసిస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ముందు నల్ల జెండాలతో ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అంటే భారతదేశం మీద దాడి జరిగినట్టేనని, నిందితున్ని వెంటనే అరెస్టు చేసి పూర్తి విచారణ జరిపించి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుందిళ్ల మల్లేష్ అధ్యక్షతన జరిపిన ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జలంపల్లి శ్రీనివాస్ మాదిగ, పట్టణ అధ్యక్షులు చిప్పకుర్తి మల్లేష్ మాదిగ, సీనియర్ నాయకులు గద్దల బానే మాదిగ, మంతెన మల్లేష్ మాదిగ, నక్క అంజన్న మాదిగ, చకినారపు మల్లేష్ మాదిగ, రాసపాక మల్లేష్ మాదిగ, ఇరువురాల మల్లేష్ మాదిగ, వేల్పుల సతీష్ మాదిగ, అట్కపురం రాయమల్లు మాదిగ, ఎంఎస్‌ఎఫ్ జిల్లా ఇన్చార్జి చిప్పకుర్తి సతీష్ మాదిగ, సీనియర్ నాయకులు గాలిపెల్లి సత్యనారాయణ, తగరం శ్రీనివాస్ మాదిగ, అవునురి భూమయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.