calender_icon.png 14 October, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల చెక్‌పోస్టులు పరిశీలించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్

13-10-2025 11:39:13 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీసు కమిషనర్, డీసీపీ, ఏసీపీ బాలానగర్‌లతో కలిసి సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ కల్పతరువు జంక్షన్ వద్ద 13వ తేదీ రాత్రి ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్‌పోస్ట్‌ను సందర్శించారు. అనంతరం ఎర్రగడ్డ ప్రాంతంలోని కీలక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అదేవిధంగా, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల సందర్భంలో సనత్‌నగర్ పోలీసులు సోమవారం సాయంత్రం 7 గంటలకు ప్రేం నగర్ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆక్టివా వాహనంపై ప్రయాణిస్తున్న జహీద్ ఖాన్ (రహమత్‌నగర్) అనే వ్యక్తి వద్ద రూ.2.70 లక్షల నగదు పట్టుబడింది. సరైన ఆధారాలు లేకుండా నగదు తీసుకెళ్తున్నందున ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.