calender_icon.png 14 October, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి

13-10-2025 11:22:01 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మండలం బానర్ గొంది గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు పది అయినా రాకపోవడం తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. విద్యార్థులు సారు రాక కోసం ఎదురుచూపులు ఉపాధ్యాయుడు రాకపోవడంతో విద్యార్థులు రోడ్లపై తిరుగుతున్నారు, గతంలో ఈ పాఠశాలపై ఫిర్యాదు చేసినప్పటికీ పాఠశాల ఉపాధ్యాయుడు వైఖరి మార్చుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఎస్ ఆర్ పి తనిఖీలు చేయడం  లేదన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

ఇష్ట రాజ్యాంగ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలకు సమయపాలన పాల్పించకుండా డుమ్మాలు కొడుతున్నారని వారిపై జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా డుమ్మా కొడుతుండడంతో గిరిజన విద్యార్థులు విద్యకుదూరం కావాల్సి వస్తుందని జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలపై తనిఖీలు నిర్వహించాలని, సమయపాలన పాటించని , డుమ్మాలు కొడుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని  జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ , ఉపాధ్యక్షుడు దుర్గం నిఖిల్ డిమాండ్ చేశారు.