calender_icon.png 14 October, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ జీవితమంతా ప్రజలకే త్యాగం

13-10-2025 11:17:53 PM

ఆదిలాబాద్, (విజయక్రాంతి): సీపీఐ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ గుండా మల్లేష్ జీవితం అంతా ప్రజల కోసం త్యాగాలు చేసిన చరిత్ర అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ గుండా మల్లేష్ 5వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కామ్రేడ్  మల్లేష్ మూడు సార్లు ఆసిఫాబాద్ శాసనసభ్యులుగా, ఒకసారి బెల్లంపల్లి శాసనసభ్యులుగా ప్రజలకు సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఝాన్సీ మండల కార్యదర్శి అర్ధాంగి రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మహబూబ్ ఖాన్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా బేగం, కామ్లే రాందాస్, బెజ్జంకి నర్సింగరావు, కొడప సురేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.