13-10-2025 11:09:48 PM
చారకొండ: ఇంటి మిద్దె మీద నుంచి జారీ పడి ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం మండలంలోని సారంబండ తండా చెందిన ఇస్లావత్ ధన్ కోటి(44) ఈనెల 1న మిద్దె ఎక్కి ప్రమాదవశత్తు జారి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనికి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య బుజ్జితో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సంఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.