దళిత సర్పంచ్‌పై బీఆర్‌ఎస్ నాయకుల దాడి హేయమైన చర్య
చొప్పదండి, ఆగస్టు 6 (విజయ క్రాంతి): గంగాధర మండలం నారాయణపూర్ సర్పంచ్ భర్త ధీకొండ మధుపై జరిగిన దాడిని గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మండల ప్రజా కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడు తూ.. కేవలం ఒక గ్రామ సభలో తీర్మానం చే సినంత మాత్రాన ముంపు గ్రామం సమస్య పరిష్కారం కాదని, ఒకవేళ అలా అవకాశం ఉంటే గతంలో ఇక్కడే పుట్టి పెరిగిన రవిశంకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి సర్పంచ్ పై ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించారు.
దళిత సర్పంచ్ పై బీఆర్‌ఎస్ నాయకుల దాడి హేయమైన చర్య అని, ఇక ముందు ఇలాంటి దాడులు జరిగితే కాంగ్రెస్ పార్టీ పక్షాన చూస్తూ ఊరుకునేది లేదని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంత్రి మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రొమాల రమేష్, మాజీ జెడ్పిటిసి గునుకొండ బాబు, సర్పంచ్ లు పడాల భాగ్యలక్ష్మి రాజన్న, వేముల భాస్కర్, దాసరి శంకరయ్య, రాచమల్ల రవి, బాసవేని శ్రీనివాస్, కోలేపాక కవిత మల్లేష్, బీర్ల ఆనంద్, గుండవేని లావణ్య తిరుపతి, చిందం ఆంజనేయులు, నాయకులు పాల్గొన్నారు.






