ఎంపీ చామల వరీయ్గులపై దాడి!
సూర్యాపేట, జులై 26 (విజయక్రాంతి): తిరుమలగిరి మండల కేంద్రంలో ఆదివారం ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గీయులైన అడ్వకేట్ పర్రేపాటి యుగంధర్, కందుకూరి అంబేద్కర్ మీడయా సమావేశం అనంతరం బయటకు వెళ్తుండగా.. పాత గొడవలు దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే సామెల్ వర్గీయులైన అచ్యుత్‌తోపాటు మరికొందరు అంబేద్కర్‌పై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు.
అదే సమయంలో గొడవ వద్దు అంటూ యుగంధర్ వెళ్లగా అతనిపై కూడా దాడి చేసినట్లు తెలిపా రు. పోలీసులు చూస్తుండగానే ఈ సంఘటన జరగడం గమనార్హం. అయితే పర్రెపాటి యుగంధర్ వెంటనే ఎస్పీకి ఫోన్ చేసి జరిగిన సంఘటన తెలిపారు. తిరుమలగిరి ఎస్‌ఐ వెంకట్ రెడ్డి మాత్రం, అంబేద్కర్ కు, అచ్యుత మధ్య ఉన్న కుటుంబ, వ్యక్తిగత తగాదా అని, దీన్ని రాజకీయానికి పూయవద్దని ప్రెస్‌నోట్‌లో పేర్కొనడం గమనార్హం.






