24-04-2025 12:00:00 AM
లక్షెట్టిపేట, ఏప్రిల్ 23: పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా సమీపం లోని నిర్మానుష్య ప్రదేశంలో పేకాట స్థావరంపై బుధవారం ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
అరెస్టు అయినవారిలో తుమ్మల సునీల్, ఎస్.కె. సనీర్, ఏనుగుల తిరుపతి, గౌరువంతుల ప్రశాంత్, కడమండ్ల శేఖర్, రాచర్ల రాకేష్, ముప్పు శ్రీధర్, పేరం పోచం ఉన్నారు. వారివద్ద నుంచి రూ. 3470 నగదు, ఐదు సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.