calender_icon.png 26 August, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'మోడల్' విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్

23-04-2025 10:48:00 PM

మందమర్రి (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పట్టణంలోని తెలంగాణ మోడల్ కాలేజ్ విద్యార్థులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అభినందించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.

ప్రైవేటు కళాశాలలకు  దీటుగా ఆదర్శ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించి జిల్లాకు వన్నె తీసుకువచ్చారని వారిని ప్రత్యేకంగా అభినందించారు. కాగా అత్యుత్తమ మార్కులు సాధించిన వారిలో ఎంపీసీ లో జి అనూష 987 మార్కులు, టి హర్షిత 982 మార్కులు, బీపీసీలో పి వైశాలి 986 మార్కులు, ఎం హాసిని 973 మార్కులు, సిఈసి లో ప్రతిమాదేవి 932 మార్కులు, కే శ్రీనిధి 927 మార్కులు సాధించారు. వీరిని ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సారా తస్నీమ్, అధికారులు పాల్గొన్నారు